పోలీసులకు చిక్కిన ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా

పోలీసులకు చిక్కిన ఎర్ర చందనం స్మగ్లర్ల ముఠా

రేణిగుంట: అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగల భారీ డంప్ ను స్వాధీనం చేసుకున్నారు రేణిగుంట టాస్క్ ఫోర్స్ పోలీసులు. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 94 ఎర్ర చందనం దుంగలను, వాటిని తరలిస్తున్న తొమ్మిది మంది స్మగ్లర్లను  పోలీసులు ప్లాన్ వేసి పట్టుకున్నారు. వారి వద్దనుండి మూడు బైకులు, ఒక టాటా సుమో స్వాధీనం చేసుకున్నారు.

రేణిగుంట మండలం లోని కుమ్మరిపల్లి వద్ద ఈ భారీ డంప్  పోలీసులకు చేజిక్కింది. రెండు రోజుల ముందు నుంచి ఈ ఆపరేషన్ జరుపుతున్న పోలీసులు.. సివిల్ పోలీసు శ్రీహరికి అందిన సమాచారం తో ఆర్ ఐ జె ఎన్ వి సత్యనారాయణ, డీఅర్వొ బి.వరప్రసాద్ ఇతర సిబ్బందితో కలసి స్మగ్లర్లు ను అనుసరించారు. స్మగ్లర్లు ఉపయోగిస్తున్న మూడు బైకులు, ఒక టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు అందరూ స్థానికులే కావడం విశేషం.  సంఘటనా స్థలానికి టాస్క్ ఫోర్స్ ఎస్పి రవిశంకర్, డీఎస్పీ అల్లా బక్ష్,  ఆర్ ఐ చెందు, సిఐ సుబ్రమణ్యం చేరుకుని పరిస్థితి ని సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ ఐజి కాంతారావు సిబ్బందిని అభినందించారు.

అరెస్టైన తొమ్మిది మందిలో సి. శ్రావణ్ కుమార్ (22), ఢిల్లీ బాబు(24),ఎమ్. మల్లికార్జున రెడ్డి(22),కె . సురేష్  కుమార్ (32) ,ఈ . రాజేష్ (24) ,కె . ప్రభాకర్ రెడ్డి(35) ,జె . సంజీవ(24),జి . శ్రీనివాసులు (30), పి . మునేశ్వర్(19) లు ఉన్నారు.