మలయశ్రీకి కన్నీటి వీడ్కోలు.. కవులు, రచయితలు నాస్తిక సంఘాల నివాళి

మలయశ్రీకి కన్నీటి వీడ్కోలు.. కవులు, రచయితలు నాస్తిక సంఘాల నివాళి

కరీంనగర్, వెలుగు: సుప్రసిద్ధ పరిశోధకుడు, కవి, రచయిత, భౌతికవాది పత్రిక ఎడిటర్ డాక్టర్ మలయశ్రీకి కవులు, కళాకారులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, కుటుంబ సభ్యులు శనివారం అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. కరీంనగర్​లోకి రేకుర్తిలో ఆయన ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

మలయశ్రీ పార్థివదేహానికి కవులు, రచయితలు జూకంటి జగన్నాథం, కలవకుంట్ల రామకృష్ణ, గండ్ర లక్ష్మణరావు, సబ్బని లక్ష్మీనారాయణ, గాజోజు నాగభూషణం, వావిలాల భూపతిరెడ్డి, వేణుశ్రీ, సరిపల్లి కృష్ణారెడ్డి, బాలసాని రాజయ్య, కూకట్ల తిరుపతి, లక్ష్మణబోధి, బూర్ల వెంకటేశ్వర్లు, రంగినేని మోహనరావు, బాలసాని కొమురయ్య, గుండు రమణయ్య, ఆడెపు లక్ష్మణ్, గడిపే మల్లేశం, వైరాగ్యం ప్రభాకర్, సమ్మయ్య, బుచ్చయ్య, సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు జీడి సారయ్య, దళిత లిబరేషన్ నాయకులు మార్వాడి సుదర్శన్, విద్యార్థి సంఘ నాయకులు బాలసాని లెనిన్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

మలయశ్రీ మృతిపై బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, కాళోజీ అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్, సంగిశెట్టి శ్రీనివాస్, కాళోజీ ఫౌండేషన్ బాధ్యులు నాగిళ్ల రామాశాస్త్రి, వీఆర్ విద్యార్థి, అంపశయ్య నవీన్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ తిరుపతయ్య తదితరులు సంతాపం తెలిపారు.