రేణుకా చౌదరి, అనీల్ కుమార్ యాదవ్ లకు రాజ్యసభ

రేణుకా చౌదరి, అనీల్ కుమార్ యాదవ్ లకు రాజ్యసభ

రాజ్యసభ అభ్యర్థులపై రెండో లిస్ట్ రిలీజ్ చేసింది. మూడు రాష్ట్రాల్లోని రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించగా.. తెలంగాణ నుంచి ఇద్దరిని ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. మరో అభ్యర్థిగా ఎం.అనీల్ కుమార్ యాదవ్ కు ఎంపిక చేసింది హైకమాండ్. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ అధికారికంగా లిస్ట్ రిలీజ్ చేశారు. రేణుకాచౌదరికి రాజ్యసభ అనేది కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. మరో అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ మాత్రం చాలా మంది ఊహించలేదు. ముషీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు.. అనీల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఎంపిక చేసింది. 

కర్నాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ లను రాజ్యనభకు ఎంపిక చేసింది హైకమాండ్. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే.. అశోక్ సింగ్ పేరును ఖరారు చేసింది అధిష్టానం. ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభకు పోలింగ్ జరగనుంది.