ఖాళీ పోస్టులు భర్తీ చేయండి : ప్రభుత్వం ఆదేశాలు

ఖాళీ పోస్టులు భర్తీ చేయండి : ప్రభుత్వం ఆదేశాలు

హైదరాబాద్‌, వెలుగు: గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ వరకు ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అన్ని గ్రామాలను మోడల్‌ పంచాయతీలుగా మార్చే ఉద్దేశంతో గ్రామానికో కార్యదర్శిని నియమించాలని, ఇతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 12,751 గ్రామాలకుగాను 9 వేల మంది పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం గతంలో నియమించింది.

ఖాళీగా ఉన్న మిగతా 3,751 పోస్టులను కూడా జిల్లా స్థాయిలోనే కలెక్టర్లు భర్తీ చేయాలని వికాస్‌ రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ, డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీడీఓ, ఎంపీఓ పోస్టులను కూడా అడ్‌హక్‌ పద్ధతిలో భర్తీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.