నాకు మెంటల్‌గా ఉంది.. క్రికెట్‌కు బ్రేక్ తీసుకున్న టీమిండియా వికెట్ కీపర్

నాకు మెంటల్‌గా ఉంది.. క్రికెట్‌కు బ్రేక్ తీసుకున్న టీమిండియా వికెట్ కీపర్

భారత వికెట్ కీపర్-బ్యాటర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన కిషాన్ బీసీసీఐను రిక్వెస్ట్ చేయడంతో కిషాన్ ను టెస్ట్ స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. అయితే కిషన్ బీసీసీఐని ఏమని రిక్వెస్ట్ చేసాడో ప్రస్తావించలేదు. తాజాగా వస్తున్న సమాచార ప్రకారం కిషన్ మానసికంగా అలసిపోయాడని.. ఈ కారణంగానే క్రికెట్ నుంచి కొంతకాలం బ్రేక్ కావాలని కోరినట్టు నివేదికలు చెబుతున్నాయి. 

ఇషాన్ కిషన్ గత సంవత్సర కాలంగా భారత స్క్వాడ్ లో ఉంటున్నాడు. తుది జట్టులో ఆడే అవకాశం తక్కువగానే వచ్చినా.. ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. కిషన్ ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆడాడు. తొలి మూడు టీ20 ల తర్వాత కిషన్ కు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ లో ఎంపికైన కిషాన్.. బెంచ్ కే పరిమితమయ్యాడు. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాత జరిగిన రెండు టీ20 లకు ఇషాన్ కాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ గా జితేష్ శర్మకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.

ఇషాన్ కిషాన్ టెస్ట్ స్క్వాడ్ నుంచి తప్పుకోగా.. ఈ యువ వికెట్ కీపర్ స్థానంలో తెలుగు కుర్రాడు కేయస్ భరత్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గా ఎంపిక చేశారు. ఈ సిరీస్ కు ప్రధాన వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్ భారత టెస్టు జట్టులో కొనసాగుతాడు. ప్రస్తుతం భారత్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత డిసెంబర్ 26 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది.