మద్యం దుకాణాల్లో రిజర్వేషన్.. కేబినెట్ నిర్ణయం

మద్యం దుకాణాల్లో రిజర్వేషన్.. కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్: మద్యం దుకాణాల రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసార్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్‌ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయంచింది. గురువారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాల విషయంలో రిజర్వేషన్ల అములుకు కేబినెట్ లో ఆమోదించారు. వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో.. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.