
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా(ఆర్బీఐ) ఆఫీసర్ గ్రేడ్ –బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30.
పోస్టుల సంఖ్య: 120.
పోస్టులు: ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్) జనరల్ 83, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి (డీఆర్) – డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్(డీఈపీఆర్) 17, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి(డీఆర్) డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ మేనేజ్మెంట్
(డీఎస్ఐఎం) 20.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ సమానమైన టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. లేదా కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సమాన అర్హత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది.
– ఎకనామిక్స్‌లో ఎంఏ/ ఎంఎస్సీ లేదా సమాన అర్హత ఉండాలి.
వయోపరిమితి: 21 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 10.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఆర్బీఐ స్టాఫ్‌కు ఫీజు మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్–I, ఫేజ్–II ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫేజ్-I ఆన్ లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి (డీఆర్) – జనరల్: అక్టోబర్ 18.
ఫేజ్-I ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి (డీఆర్) -డీఈఎఫ్ఆర్ (పేపర్-I,-II)/ డీఎస్ఐఎం: అక్టోబర్ 19.
ఫేజ్-II ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి (డీఆర్) - జనరల్: డిసెంబర్ 06.
ఫేజ్-II ఆన్ లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి (డీఆర్) -డీఈఎఫ్ఆర్ (పేపర్-II, -III)/ డీఎస్ఐఎం: డిసెంబర్ 07.
పూర్తి వివరాలకు rbi.org.in వెబ్సైట్లో సంప్రదించగలరు.