సెంట్రల్ కోర్టులో సమస్యలను పరిష్కరిస్తం : గుర్రం పవన్ కుమార్ గౌడ్

సెంట్రల్ కోర్టులో సమస్యలను పరిష్కరిస్తం : గుర్రం పవన్ కుమార్ గౌడ్

పద్మరావునగర్, వెలుగు: బోయిగూడలోని ఎంఎన్​కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్​మెంట్​లో అధిక నీటి బిల్లులు, డ్రైనేజీ లీకింగ్, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్​చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు. బన్సీలాల్ పేట డివిజన్ కార్పొరేటర్ హేమలతతో కలిసి బుధవారం సెంట్రల్ కోర్టు అపార్ట్​మెంట్​ను ఆయన సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అపార్ట్​మెంట్​లో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకున్నారు. అపార్ట్​మెంట్​ కనెక్షన్​కు పనిచేయని నల్లా మీటర్​కు వాటర్ బోర్డు ఏకంగా రూ.2 లక్షల బిల్లు వేసినట్లు స్థానికులు పవన్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వాటర్​బోర్డు అధికారులతో మాట్లాడిన పవన్ కుమార్ గౌడ్.. బిల్లు సమస్యను పరిష్కరించాలని సూచించారు.

అదే విధంగా అపార్ట్​మెంట్ ఆవరణలో కొన్నేండ్లుగా పార్కింగ్​లో ఉన్న వెహికల్స్ కారణంగా దుమ్ము పేరుకుపోతుందని స్థానికులు తెలపగా.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ వెహికల్స్​ను వారిని అప్పగించాలని చెప్పారు. బోయిగూడ వై జంక్షన్​ నుంచి పాత గాంధీ ఆస్పత్రికి వెళ్లే రోడ్డుపై నిత్యం డ్రైనేజీ పొంగుతుండటంతో ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కుమార్ గౌడ్ అధికారులకు ఫోన్ చేసి కోరారు. సమస్యలపై స్పందించిన గుర్రం పవన్ కుమార్ గౌడ్​తో పాటు కార్పొరేటర్ హేమలతకు అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ జి. హనుమాండ్లు, కో ఆర్డినేటర్ వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు కె. మోహన్ దాస్, కాళిదాసు, సేతు మాధవరావు, సుధీర్ బాబు, అపార్ట్​మెంట్ వాసులు -కృతజ్ఞతలు తెలిపారు.