ఢిల్లీలో పొగమంచు.. పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత కేసులు

ఢిల్లీలో పొగమంచు.. పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత కేసులు

దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. శాంతి పాత్ లోని జేఎల్ఎన్ స్టేడియం దగ్గర భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో స్థానికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ NCRలో ఇటీవల కురిసన వర్షాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం, సాయంత్రం చాలా చలితో కూడిన వాతావరణం ఉంటోంది. 

వాతావరణంలో మార్పుల వల్ల ఢిల్లీలో పొగమంచు అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీంతో శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఉబ్బసం లాంటి కేసులు ఎక్కువైతున్నాయని వెల్లడించారు. అస్తమాతో బాధపడుతున్న వారిపై ఈ పొగమంచు అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. దీని వల్ల వారికి సమస్య మరింత ఎక్కువవుతోందని అపోలో ఆసుపత్రిలోని రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ నిఖిల్ మోడీ చెప్పారు.