స్విగ్గీ, జొమాటోకు పోటీగా రెస్టారెంట్​ యాప్​

స్విగ్గీ, జొమాటోకు పోటీగా రెస్టారెంట్​ యాప్​
  • రెస్టారెంట్​ అసోసియేషన్​

న్యూఢిల్లీ: డెలివరీ కంపెనీలు​ జొమాటో, స్విగ్గీలకు పోటీగా ఓ యాప్‌ను తీసుకురావాలని నేషనల్​ రెస్టారెంట్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​ఆర్​ఏఐ) చూస్తోంది. డీప్​డిస్కౌంటింగ్​, డేటా మాస్కింగ్​తోపాటు, ప్లాట్​ఫామ్​ న్యూట్రాలిటీ విషయంలోనూ జొమాటో,స్విగ్గీలతో రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎన్​ఆర్​ఏఐ వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్​ నాటికి తమ యాప్​ తేవాలనుకుంటున్నట్లు ఎన్​ఆర్​ఏఐ ప్రెసిడెంట్​ అనురాగ్​ కత్రియార్​ ప్రకటించారు. దేశంలోని 5 లక్షల రెస్టారెంట్లకు ఈ అసోసియేషన్​లో మెంబర్​షిప్​ ఉంది. టెక్నాలజీ పార్ట్​నర్​తో చురుగ్గా డిస్కషన్స్​ జరుగుతున్నాయని, ఆ కంపెనీకే బ్యాక్​ ఎండ్​ మేనేజ్​మెంట్​ బాధ్యతలు అప్పచెప్పనున్నామని కత్రియార్​ పేర్కొన్నారు. యాప్​ సొంతదారు ఎన్​ఆర్​ఏఐనే అవుతుందని, బయటి పార్ట్​నర్​ నిర్వహిస్తారని చెప్పారు. దేశంలోని మెంబర్లందరి కోసం సింగిల్​ లాయల్టీ ప్రోగ్రామ్​ తేవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. జొమాటో గోల్డ్​ వంటి లాయల్టీ యాప్స్​కు చేసినట్లు తమ లాయల్టీ యాప్​కు ఎలాంటి చెల్లింపులనూ కన్జూమర్లు చేయక్కర్లేదని వెల్లడించారు. అంతేకాదని, తమకు నచ్చిన రెస్టారెంట్లలో లాయల్టీ పాయింట్లను వాడుకోవచ్చని తెలిపారు. తమ లాభాలు తగ్గడంతో రెస్టారెంట్లు మూతపడుతుంటే, ఈ కంపెనీల ​ వాల్యుయేషన్స్ పెరుగుతున్నాయన్నారు.