మయన్మార్‌‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి

మయన్మార్‌‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి

న్యూయార్క్: ఆర్మీ పాలనలో ఉన్న మయన్మార్‌‌లో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా పాలనను పునరుద్ధరించాలని ఆ దేశ నాయకత్వాన్ని భారత్ కోరింది. రాజకీయంగా ఏర్పడిన విభేదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. మయన్మార్ గురించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్‌‌జీఏ)లో జరిగిన మీటింగ్‌‌లో భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పైవ్యాఖ్యలు చేశారు. మయన్మార్‌‌లో ఏర్పడిన పరిస్థితులను భారత్ గమనిస్తోందన్నారు. ‘మయన్మార్‌‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. జైళ్లలో వేసిన వారిని విడుదల చేయాలి. అప్పుడే శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి. సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించాలని మయన్మార్ నాయకత్వాన్ని మేం కోరుతున్నాం’ అని యూఎన్‌లో తిరుమూర్తి స్పష్టం చేశారు.