ఇతర రాష్ట్రాల బస్సుల ఎంట్రీపై ఢిల్లీ ఆంక్షలు!

ఇతర రాష్ట్రాల బస్సుల ఎంట్రీపై ఢిల్లీ ఆంక్షలు!
  • గెజిట్ నోటిఫికేషన్​ విడుదల

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్​ క్వాలిటీ రోజురోజుకూ క్షీణిస్తున్న వేళ.. నాలుగో దశ ఆంక్షలు అమల్లోకి వస్తే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల ప్రవేశాన్ని కూడా నియంత్రిస్తామని ఆ రాష్ట్ర  ప్రభుత్వం నోటిఫై చేసింది. ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి కేంద్రం రూపొందించిన గ్రేడెడ్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్ స్టేజ్​4 (గ్రాప్ 4) అమల్లోకి వస్తే.. సీఎన్‌‌జీ, బీఎస్‌‌6 డీజిల్‌‌ బస్సులు, ఎలక్ట్రిక్‌‌ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల బస్సుల ప్రవేశంపై ఆంక్షలు ఉంటాయని, గ్రాప్ 4ను రద్దు చేస్తే.. ఆంక్షల్లో ఆటోమేటిక్​ సడలింపు ఉంటుందని బుధవారం రిలీజ్​ చేసిన గెజిట్​ నోటిఫికేషన్​లో ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.

ఎయిర్​ క్వాలిటీ స్కోర్​ను బట్టి కేంద్రం నాలుగు గ్రాప్​దశలను వర్గీకరించింది. ఏక్యూఐ300 లోపు స్టేజ్​1, ఏక్యూఐ 400 లోపు స్టేజ్​2, ఏక్యూఐ 450 లోపు స్టేజ్​3, ఏక్యూఐ 450 స్కోర్​దాటితే స్టేజ్​4గా విభజించింది. కాగా బుధవారం ఉదయం ఢిల్లీ సిటీ అంతటా ఎయిర్​క్వాలిటీ బాగా దిగజారింది. మంగళవారం నాటికి 365 పాయింట్ల దగ్గర ఉండగా, బుధవారం ఉదయం 9.05 గంటలకు 394 పాయింట్లకు పెరిగింది.