పండుగ సీజన్ కు అమెజాన్ రెడీ.. లోకల్ డిలైట్స్ స్టోర్ ప్రారంభం

పండుగ సీజన్ కు  అమెజాన్ రెడీ.. లోకల్ డిలైట్స్  స్టోర్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఈ-–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియాలో తన నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను విస్తరించింది.  డెలివరీ సామర్థ్యాలను పెంచడానికి 12 కొత్త ఫుల్‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్లను, ఆరు కొత్త సార్ట్ సెంటర్లను ప్రారంభించింది. ఈ విస్తరణతో నిల్వ సామర్థ్యం 8.6 మిలియన్ క్యూబిక్ అడుగులు అదనంగా పెరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఫుల్‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్‌‌‌‌‌‌‌‌లు హుగ్లీ, తిరువళ్లూరు, కృష్ణగిరి, విశాఖపట్నం, హుబ్బళ్లిలో ఉన్నాయి. హుబ్లి, త్రివేండ్రం, రాజ్‌‌‌‌‌‌‌‌పురా, గోరఖ్​పూర్​, మొరాదాబాద్​, ప్రయాగ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌లో ఆరు కొత్త సార్ట్ సెంటర్‌‌‌‌‌‌‌‌లను కూడా ప్రారంభించింది. వీటి మొత్తం విస్తీర్ణం 5 లక్షల చదరపు అడుగులు.

లోకల్ డిలైట్స్  స్టోర్ ప్రారంభం

పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌ను పురస్కరించుకుని అమెజాన్ ఫ్రెష్ 'లోకల్ డిలైట్స్ స్టోర్'ను ప్రారంభించింది. ఈ స్టోర్ ద్వారా  ప్రాంతీయ ఆహార పదార్థాలను ఆర్డర్ చేసిన రెండు గంటల్లో ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌లో ఫిల్టర్ కాఫీ, మురుక్కు, మామిడి ఆవకాయ, మక్కీ అట్టా (జొన్న పిండి) వంటి అనేక రకాల ప్రాంతీయ వంటకాలు, పండుగ స్పెషల్స్ లభిస్తాయి. 170కి పైగా నగరాల్లో కేవలం 2 గంటల్లో డెలివరీ చేస్తారు. అమెజాన్ పేతో చెల్లిస్తే అదనంగా డిస్కౌంట్​ ఇస్తారు.