V6 News

యూత్‌‌‌‌‌‌‌‌ కు నచ్చేలా.. రెటీనా మూవీ 

యూత్‌‌‌‌‌‌‌‌ కు నచ్చేలా.. రెటీనా మూవీ 

మనీష్, సోనియా నాయుడు, ప్రీతీ  హెస్సోనా హీరో హీరోయిన్లుగా  అల్లం రాజు దర్శకత్వంలో  పార్వతి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రొడక్షన్ నెం.1 గా ‘రెటీనా’ చిత్రం   ప్రారంభమైంది.  ఆదివారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలవగా ముహూర్తపు షాట్‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ  క్లాప్ కొట్టారు, ‘రజాకార్’  దర్శకుడు యాట  సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్  చేశారు. 

తొలి షాట్‌‌‌‌‌‌‌‌కు ‘కమిటీ కుర్రోళ్ళు’  ఫేమ్ యశ్వంత్ పెండ్యాల  దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా  దర్శకుడు అల్లం రాజు మాట్లాడుతూ ‘యువ తరానికి నచ్చే కథ ఇది. ‘రెటీనా’ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యం.  ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని అన్నాడు.