రిటైర్ట్ IPS సంతకాన్నే ఫోర్జరీ చేసి :57 ఎకరాలు కొట్టేశారు

రిటైర్ట్ IPS సంతకాన్నే ఫోర్జరీ చేసి :57 ఎకరాలు కొట్టేశారు

సంగారెడ్డి జిల్లా ఆందోల్ గ్రామంలో సంతకాలు ఫోర్జరీ ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి చెందిన భూమిని ఇతరులకు విక్రయించారు కేటుగాళ్లు. హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన ప్రభాకర్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు సంజీవ రెడ్డి, రాథోడ్ సుధాకర్, రవీందర్. దొంగ సంతకాలతో ప్రభాకర్ రెడ్డికి చెందిన 57ఎకరాల భూమిని హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ కు 22 కోట్ల 30లక్షల రూపాయలకు విక్రయించారు. బిల్డర్ నుంచి టోకెన్ అమౌంట్ గా 11లక్షలు తీసుకున్నారు. దీనిపై సంగారెడ్డి ఎస్పీ రూపేష్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ రెడ్డి. కేసు నమోదు చేసిన పోలీసులు..నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  

ALSO READ | తెలంగాణ కొత్త డీజీపీ జితేందర్