హైదరాబాద్ కమిషనరేట్లో 18 మంది పోలీసు అధికారుల పదవీ విరమణ

హైదరాబాద్ కమిషనరేట్లో 18 మంది పోలీసు అధికారుల పదవీ విరమణ

హైదరాబాద్ కమిషనరేట్లో 18 మంది పోలీసు అధికారుల పదవీ విరమణ చేశారు. 42 ఏళ్లపాటు సేవలందించిన 18 మంది పోలీసులకు ఘన వీడ్కోలు పలికారు సీపీ సజ్జనార్. బంజారాహిల్స్‌లోని TGICC ఆడిటోరియంలో రిటైర్మెంట్‌ కార్యక్రమంలో అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. 

 పదవీ విరమణ చేసిన వారిలో ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు ఎస్సైలు, ఆరుగురు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌ఉన్నారు. రిటైర్‌ అయిన పోలీసులను సత్కరించారు సీపీ వీసీ సజ్జనార్‌.  రిటైర్డ్‌ పోలీసులకు జ్ఞాపికలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేశారు. 

 రిటైర్మెంట్‌ నిధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.  అధిక వడ్డీ ఆశతో మోసపూరిత సంస్థలను నమ్మొద్దని హెచ్చరించారు.  రిటైర్మెంట్‌ డబ్బులను ప్రభుత్వ రంగ సంస్థల్లోనే డిపాజిట్‌ చేసుకోవాలని సూచించారు. 

సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీపీ సూచించారు. రిటైర్డ్‌ పోలీసులకు కుటుంబ సభ్యులు అండగా ఉండాలని సీపీ విజ్ఞప్తి చేశారు.