
కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పడ్తున్నారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మరికొందరు కూడా ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ తో మాట్లాడేందుకే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పడ్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం పార్లమెంట్ లో జరిగే డిఫెన్స్ స్టాడింగ్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటారు ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి రాహుల్ కూడా హాజరవుతున్నారు. మీటింగ్ తర్వాత రేవంత్ రాహుల్ ను కలిసి పీసీసీ పోస్ట్ పై చర్చించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మెజార్టీ డీసీసీలు రేవంత్ కే మద్దతిస్తున్నాయన్న ప్రచారంతో పీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న మిగతా నేతలు అలర్ట్ అయ్యారు. వారు కూడా ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అసలైన కాంగ్రెస్ వాదికే చాన్స్ ఇవ్వాలని వారు కోరనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. సీనియర్ నేతల ఢిల్లీ టూర్ తర్వాత పార్టీలో కీలక పరిణామాలుంటాయంటున్నారు.