ల‌క్ష కాదు.. రూ.2 ల‌క్షల అప్పులు మాఫీ చేస్తాం : కాంగ్రెస్ సంచ‌ల‌న ప్రక‌ట‌న‌

ల‌క్ష కాదు.. రూ.2 ల‌క్షల అప్పులు మాఫీ చేస్తాం :  కాంగ్రెస్ సంచ‌ల‌న ప్రక‌ట‌న‌

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షలు మాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. గాంధీభవన్ లో జాతీయ జెండా అవిష్కరణ అనంతరం మాట్లాడిన రేవంత్ .. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. 

అంతేకాకుండా గృహనిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని రేవంత్ తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొద్దామంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు అంటూ డ్రామాలాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  కేసీఆర్ ఎన్ని కట్టకథలు చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.  బీఆర్‌ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై తాము వచ్చాక సమీక్షిస్తామని చెప్పారు.