సీఎం వస్తే ప్రజా ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తారా?: రేవంత్

సీఎం వస్తే ప్రజా ప్రతినిధుల్ని అరెస్ట్ చేస్తారా?: రేవంత్

సీఎం వస్తుంటే ప్రజా ప్రతినిధుల్ని అరెస్టులు చేస్తారా అంటూ  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దామరచర్లకు సీఎం వస్తే గతంలో ఇచ్చిన హామీలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ బాధ్యత అన్నారు. భూ నిర్వాసితులకు పరిహారాలు, ఇతర సౌకర్యాలు, స్థానికులకు ఉద్యోగాలు, పోడు భూములకు పట్టాలు, జాబ్ కార్డ్స్ గురించి కాంగ్రెస్ నాయకులు సీఎంను అడిగారన్నారు.

డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం ముఖ్యమంత్రిని ఆడిగేందుకు  వెళ్లడం నేరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ నాయక్ తోపాటు ఆడివిదేవిపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంత నాయకులను అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.