హిమాచల్లో కాంగ్రెస్ విజయాన్ని చిన్నది చేసి చూపిస్తున్రు : రేవంత్ రెడ్డి

హిమాచల్లో కాంగ్రెస్ విజయాన్ని చిన్నది చేసి చూపిస్తున్రు : రేవంత్ రెడ్డి

ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ప్రజలే వద్దనుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఢిల్లీ మున్సిపాలిటీలో ఓటమి పాలైందని చెప్పారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపాలిటీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉప ఎన్నిక జరిగితే గుజరాత్ తప్ప అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయిందని అన్నారు. అయినా అన్నింట్లో గెలిచినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.  హిమాచల్ ప్రదేశ్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని రేవంత్ చెప్పారు. అయితే బీజేపీ అనుకూల మీడియా మాత్రం కాంగ్రెస్ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇదిలా ఉంటే సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ మెగా రక్తదాన శిబిరం, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద బీమా ఇస్తున్నామన్న ఆయన.. ఇవాళ 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశామని అన్నారు. ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావేత్ తో పాటు మాజీ మంత్రులు, ఇతర నేతలు సోనియా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.