- సీఎంసీ, ఎంఎంసీ వినూత్న నిర్ణయం
హైదరాబాద్‌సిటీ, వెలుగు: పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు వినూత్న నిర్ణయం తీసుకున్నాయి. మీ ప్రాంతంలో చెత్త పేరుకుపోయినా.. డస్ట్బిన్లు నిండిపోయి ఇబ్బందిగా ఉన్నా ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
పౌరులు తమ వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్య సమస్యలను గమనిస్తే వెంటనే వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. సమస్య ఉన్న చోట ఒక ఫోటో తీసి, దానితో పాటు లైవ్ లొకేషన్ షేర్ చేస్తే, అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తారు. సీఎంసీ అయితే 9063421347కు, ఎంఎంసీ పరిధిలో 9063421300 వాట్సాప్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
