అసెంబ్లీని తండ్రీకొడుకులు తప్పుదోవ పట్టించారు : రేవంత్ రెడ్డి

అసెంబ్లీని తండ్రీకొడుకులు తప్పుదోవ పట్టించారు : రేవంత్ రెడ్డి

యురేనియం తవ్వకాలతో…వాతావరణం కలుషితమవుతుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యావరణాన్ని నాశనం చేసే ఇలాంటి తవ్వకాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా… హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ భేటీలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఎంపీ రేవంత్ రెడ్డి, కోదండరాం, చాడవెంకట్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

అసెంబ్లీ, మండలిని తండ్రికొడుకులు కేసీఆర్, కేటీఆర్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు ఎంపీ రేవంత్ రెడ్డి. యురేనియం తవ్వకాలకు సంబంధించి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేస్తూ…ఫారెస్ట్ అడ్వైజరీలో ఏకవాక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. యురేనియం తవ్వకాలతో చెంచులు, వన్యప్రాణులకు హాని జరుగుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి.

నల్లమలను కాపాడే వరకు పోరాటం చేయాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి. పెద్దగట్లు, అమ్రాబాద్ ప్రకృతి ఇచ్చిన సంపదన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఏపీలోనూ ఉద్యమాలు చేయాలని సూచించారు.

యురేనియం తవ్వకాలు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమన్నారు టీజేఎప్ అధ్యక్షుడు కోదండరాం. అడవిలో యురేనియం అన్వేషణను కూడా ఆపాలన్నారు.

అఖిలపక్షం చేసిన తీర్మానంపై సీఎం కేసీఆర్ మొదటి సంతకం చేయాలన్నారు నేతలు. యురేనియం తవ్వకాలపై పోరాటానికి రెండు రాష్ట్రాల తరుపున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.