
మాదాపూర్, వెలుగు : పదేండ్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే శేరిలింగంపల్లి యువతకు ఉపాధి కల్పించేందుకు కంపెనీలు తేలేదని, ఇక్కడి భూములను తెగనమ్ముకున్నారని టీ పీసీసీ ప్రెసిడెంట్రేవంత్రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పేరులోనే గాంధీ ఉంది కానీ, అరికెపూడి గాంధీవి అన్నీ దొంగ బుద్ధులేనని ఘాటుగా విమర్శించారు. తిన్నంటి వాసాలు లెక్కపెట్టే వారిలా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్నారు.
ఆదివారం సాయంత్రం శేరిలింగంపల్లిలోని కొండాపూర్ఆర్టీఏ ఆఫీస్వద్ద నిర్వహించిన రోడ్ షోలో శేరిలింగంపల్లి కాంగ్రెస్అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. 2014లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా గాంధీని గెలిపిస్తే శత్రువు పక్కన చేరి, ఇంటి దొంగగా మారి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. 1964లో బీహెచ్ఈఎల్పరిశ్రమ వస్తే 200 ఎకరాల భూములు కోల్పోయిన జగదీశ్వర్గౌడ్బాబాయి కాంగ్రెస్‌నేత మల్లికార్జున్నిజాయితీగా సేవలు చేశారన్నారు. రాజకీయాల్లో మంచిని బతికించాలంటే జగదీశ్వర్‌గౌడ్‌ను గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే టికెట్‌ను జెరిపాటి జైపాల్, రఘునాథ్యాదవ్ఆశించారని, అధికారంలోకి రాగానే ఇద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.