
హైదరాబాద్: మంత్రి హరీష్‌రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. 10 రోజులుగా నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నర్సుల డిమాండ్లను హరీష్‌రావు పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు. నిమ్స్ కాంట్రాక్ట్ నర్సులకు ప్రసూతి సెలవులు, వేతన పే స్లిప్పులు ఇవ్వకపోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు. ఇది కట్టు బానిసత్వం కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. హరీష్‌రావు స్వయంగా వెళ్లి వారితో చర్చలు జరపాలని లేఖలో తెలిపారు. నర్సుల కనీస డిమాండ్లను పరిష్కరించాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఇవి కూడా చదవండి
వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట
22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్