మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో సంచలనం సృష్టించిన పబ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. డ్రగ్స్ కేసులో తన కుటుంబ సభ్యులను తప్పించాలని తాను కోరినట్లు కొందరు అసత్య ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మేనల్లుడు డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకునేందుకు శ్యాంపిల్స్ కు పంపిస్తానని... సీఎం కేసీఆర్ కేటీఆర్ ను శ్యాంపిల్స్ కు పంపిస్తారా అని సవాల్ విసిరారు. సీబీఐ, ఈడీ, సిట్ తో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పబ్ లో పట్టబడిన వారిలో డ్రగ్స్ తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి వారి శ్యాంపిల్స్ ఎందుకు సేకరించలేదని ప్రశ్నించారు. తన బంధువుల నమూనాలను ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. చదువుకునే పిల్లలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు.

గతంలో రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించానని..కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశానని చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించేందుకు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని పోరాడానన్నారు. డ్రగ్స్ అడ్డుపెట్టుకుని సినిమా రంగం పై కేటీఆర్ పట్టు సాధించారన్నారు. పబ్ లో దొరికిన వారిపై ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించలేదని ప్రశ్నించారు. అసలు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలి పెట్టి , తమ పిల్లల పై ఆరోపణలు చేయడం ఏంటని ధ్వజమొత్తారు.రాష్ట్రంలో 24 గంటలు మద్యం, పబ్బులు నడుపుకోమని పర్మిషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు. డ్రగ్స్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చేసే కుట్ర కేసీఆర్ కుటుంబం పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.

మరిన్ని వార్తల కోసం

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్