22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

న్యూఢిల్లీ: ఇప్పటికే చైనా యాప్స్‌పై నిషేధాస్త్రాన్ని సంధించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝళిపించింది. 2021 ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్ ను నిషేధించింది. యూట్యూబ్ ఛానెళ్లు, ట్విట్టర్ అకౌంట్స్, ఫేస్‌బుక్ అకౌంట్, న్యూస్ వెబ్‌సైట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యూట్యూబ్ ఛానెల్స్ జాతీయ భద్రత, విదేశాలతో భారత్ సంబంధాలకు సంబంధించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నాయని.. సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 

మోడీ సర్కార్ నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్ల మొత్తం వ్యూయర్‌షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్లు తేలింది.  వీటిలో 18 భారత్ కు చెందినవి, 4 పాకిస్తాన్‌కు చెందినవి. ఈ యూట్యూబ్ ఛానెల్స్ అన్నీ భారత సాయుధ బలగాలు, జమ్మూ కశ్మీర్ లాంటి అంశాలపై ఫేక్‌న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇకపోతే, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణాలతో ఇప్పటికే 320 యాప్స్‌ను కేంద్రం నిషేధించింది. 

మరిన్ని వార్తల కోసం:

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..