ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం

ఒకే ఫ్యామిలీకి రెండు టికెట్లు.. ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగిన ఎలక్షన్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా ముగిసింది.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లపై  పార్టీ హైకమాండ్ కు రేవంతే చెప్పాలన్నారు ఉత్తమ్. అయితే తనను డిక్టెట్ చేయొద్దని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో సమావేశం నుంచి సీరియస్ గా వెళ్లిపోయారు ఉత్తమ్. ఇక బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని PEC మీటింగ్ లో డిమాండ్ చేశారు కొందరు నేతలు.

ఈ సమావేశంలో బీసీ సీట్లపైనే సీరియస్ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు రెండు రెండు సీట్లు తీసుకుంటే బీసీలకు ఎట్లా ఇస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. జానారెడ్డికి 2 సీట్లు, ఉత్తమ్ కుమార్ కు 2 సీట్లు అంటే మరి బీసీ నేతలకు ఎక్కడిస్తారని నిలదీసినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలంతా త్యాగం చేయాలన్నారు కోమటిరెడ్డి. అవసరమైతే నల్లగొండ అసెంబ్లీ సీటు త్యాగం చేస్తామన్నారు. కోమటిరెడ్డి లేవనెత్తిన అంశం ఎన్నికల కమిటీలో హాట్ టాపిక్ అయ్యింది.