పార్టీ కార్యాలయాల పేరుతో కేసీఆర్ వెయ్యికోట్ల ఆస్తులు సంపాదించిండు

పార్టీ కార్యాలయాల పేరుతో కేసీఆర్ వెయ్యికోట్ల ఆస్తులు సంపాదించిండు

కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరందలేదన్నా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వరి  వేస్తే  ఊరే అనడంతో చాలా మంది రైతులు చనిపోయారన్నారు.తెలంగాణ వచ్చాక రైతుల ఆత్మహత్యాలు పెరిగిపోతున్నాయన్నారు.పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్ ల విధానాలతో 40 వేల మంది రైతులు చనిపోయారన్నారు. పార్టీ కార్యాలయాల పేరుతో కేసీఆర్.. 1000 కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారన్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 420 కోట్లు ఉన్నాయి అంటే.. ఇవి ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల నుండే ఈ డబ్బు వచ్చిందన్నారు..ఈ రూ. 420 కోట్లపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజాం నవాబుల కంటే.. కేసీఆర్ వారసులు ఎక్కువ ఆస్తులు సంపాదించారన్నారు. దేశంలోనే అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దేనన్నారు.