మెహిదీపట్నం, వెలుగు : నీలోఫర్ హాస్పిటల్లోకబ్జాకు గురైన స్థలాన్ని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు శనివారం పరిశీలించారు. అనంతరం వైద్య విభాగానికి చెందిన డీఎంఈ డాక్టర్ వాణి, వైద్యాధికారి శివ రామప్రసాద్ హాస్పిటల్కు చేరుకొని సూపరింటెండెంట్ డా.రవి కుమార్తో మాట్లాడారు. కబ్జా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
