తాతగారూ.. మీరింకా ఉన్నారా.. వీహెచ్ పై వర్మ సెటైర్లు

తాతగారూ.. మీరింకా ఉన్నారా.. వీహెచ్ పై వర్మ సెటైర్లు

ఏపీలోని గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ తీసుకుంటూ.. మహిళలపై రాంగోపాల్ వర్మ చేసిన కామెంట్స్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పందించారు. సమాజంలో బాధ్యత లేని ఇలాంటి వ్యక్తి ఉండటం దురదృష్టం అని.. మహిళలను కించపరుస్తూ వర్మ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వర్మపై చర్యలు తీసుకోవాలని.. కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ గవర్నర్, సీఎం జగన్ ను కలుస్తానంటూ ప్రకటించారు వీహెచ్.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఈ కాలంలో.. శృంగారానికి మాత్రమే పనికొస్తారంటూ నీచమైన కామెంట్స్ చేయటం ఏంటని నిలదీశారు. వర్మ లాంటి వారి వల్లే మహిళలపై చులకన భావం ఏర్పడుతుందని.. అన్ని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు వీహెచ్..

వీహెచ్ కామెంట్లపై స్పందించారు రాంగోపాల్ వర్మ.. ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.. ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు.. TADA యాక్ట్ ని 1995లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే.. కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకోండి అంటూ కౌంటర్ వేశారు. నా ఇష్టం.. నా చావు నేను చస్తాను అంటూ గతంలోని కామెంట్స్ ను రీపోస్ట్ చేశారు. అమ్మాయిలతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ వీహెచ్ తాతగారూ అంటూ చురకలు అంటించారు వర్మ. 

నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న వర్మ.. ఆ వర్సిటీ వీసీ సమక్షంలోనే మహిళలు అంటే అందమైన వారు.. వారు శృంగారానికి మాత్రమే పనికొస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై కొన్ని రోజులుగా రాద్దాంతం నడుస్తుంది. వర్మ మాత్రం వీహెచ్ కు కౌంటర్ ఇచ్చి.. లైట్ తీసుకుంటున్నారు..