సర్కార్ నిర్ణయంతో రైతులకు వరి గోస

సర్కార్ నిర్ణయంతో రైతులకు వరి గోస

వ్యవసాయ రంగంలో తెలంగాణ రికార్డులు క్రియేట్‌‌ చేసింది. మన రైతులు మునుపెన్నడూ లేనంతగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు బాగా కురిసి సాగునీరు పెరగడంతో సాగు విస్తీర్ణం కొన్నేళ్లలో బాగా పెరిగింది. దాంతో గవర్నమెంట్‌‌ కూడా ఇదివరకు వరిసాగును ప్రోత్సహించింది. కానీ.. ఇప్పుడు సడెన్‌‌గా మాట మార్చి, వరిసాగు వద్దని రైతుల గుండెల్లో బాంబు పేల్చింది. గవర్నమెంట్‌‌ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకున్న కారణమేంటి? ఇప్పుడు వరి రైతుల పరిస్థితి ఏంటి? 

‘‘గతంలో ఆరుతడి పంటలు వేసి నష్టపోయాం. ఇప్పుడు కాలం కలిసొచ్చి వరి పండిస్తున్నాం. నీళ్లున్నా ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలంటే.. లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ఎందుకు కట్టినట్టు? ప్రాజెక్టులు కట్టింది కోటి ఎకరాలకు నీళ్లందించేందుకే కదా! మరి నీళ్లిస్తాం. అయినా.. వాడుకోవద్దంటే ఎట్లా?” అని నిలదీస్తున్నారు రైతులు.  
 కిందటేడాది ముందువరకు గవర్నమెంట్‌‌ వరిసాగును ప్రోత్సహించింది. పైగా జాతీయ మార్కెట్‌‌లో వరికి డిమాండ్‌‌ కూడా ఉంది. కానీ.. కిందటేడాది ఆ పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. దొడ్డు వడ్లను కొనేది లేదని సర్కారు చెప్పింది. తర్వాత రైతుల ఆందోళనల వల్ల దొడ్డు వడ్లను కూడా కొంతవరకు కొన్నది. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి పెరిగిందని కొన్నాళ్ల క్రితం సీఎం కేసీఆర్‌‌ అన్నారు. అంతేకాదు ఈ డెవలప్‌‌మెంట్‌‌కి కారణం.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, గవర్నమెంట్‌‌ విధానాల’ని కూడా చెప్పారు. పైగా రైతు పండించిన చివరి గింజ కూడా గవర్నమెంట్‌‌ కొంటుందని ప్రకటించారు. కానీ.. కొన్నాళ్లకే సీన్‌‌ రివర్స్‌‌ అయింది. ఈసారి యాసంగిలో వడ్లు కొనేదే లేదని సీఎం కేసీఆర్‌‌‌‌ తేల్చి చెప్పారు. వరిసాగులో మేమే నెంబర్‌‌‌‌ వన్‌‌ అని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు వరిసాగు చేయొద్దంటూ ఆంక్షలు పెడుతోంది గవర్నమెంట్‌‌. వరి పండించే కెపాసిటీ ఉన్నా పండించకూడదని హుకుం జారీ చేసింది. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కచ్చితంగా చెబుతోంది. అంతేకాదు ఈ కష్టకాలానికి కారణం కేంద్రమే అంటూ... ఉప్పుడు బియ్యం కేంద్రం కొనడం లేదని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం. 
అయితే.. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వమే అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఎందుకంటే గవర్నమెంట్‌‌ ముఖ్యంగా నీటి పారుదలపై ఎక్కువ దృష్టి పెట్టింది. పైగా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఇవన్నీ రైతుల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. సమృద్ధిగా నీళ్లు ఇస్తామంటే.. ఆ నీళ్లతో వరి పండించాలనే ధోరణి రైతుల్లో వచ్చింది. అందుకే కొన్ని రోజుల నుంచి తెలంగాణలో చాలామంది రైతులు వరిసాగు మీద దృష్టి పెట్టారు. అయితే.. సీఎం ప్రకటనతో పాటు రైతులు వరి వైపు మళ్లడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ.. మొదటి నుంచి పంటల మీద పర్యవేక్షణ ఉంచి, రైతులను గైడ్‌‌ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్‌‌ అయింది. 
కరెంట్‌‌
వరిసాగు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణ అన్నపూర్ణ కావాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ సాగు నీటి వనరులను పెంచింది. పైగా గతంలో బోరు బావులకు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్‌‌ సరఫరా ఉండేది. ఇప్పుడు ఫ్రీగా 24 గంటలు కరెంట్‌‌ అందిస్తోంది. ఇంతకు ముందు బోరు బావుల్లో నీళ్లున్నా కరెంట్‌‌ ఉండకపోవడంతో తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేవాళ్లు. లేదా ఆరుతడి పంటలు వేసేవాళ్లు. ఇప్పుడు  ఇరవై నాలుగ్గంటలు కరెంట్‌‌ ఉండడంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది.  బీడు భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు.
సాగు విస్తీర్ణం
వర్షాలు ఎక్కువగా పడడం, రోజుకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం, యాసంగి కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. సుమారు 2.80 కోట్ల మెట్రిక్‌‌ టన్నుల ధాన్యం పండుతోంది. అయితే.. గతంలో వానాకాలంలో దాదాపు -23 లక్షల ఎకరాలు మాత్రమే వరిసాగు చేసేవాళ్లు. పోయినేడు అది 53.34 లక్షల ఎకరాలకు పెరిగింది. యాసంగిలో పోయినేడు ఎన్నడూ లేనంతగా 52.79 లక్షల ఎకరాల్లో వరి పండించారు. ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే వానాకాలంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నట్లు అంచనా. 1.48 కోట్ల మెట్రిక్‌‌ టన్నులు పండే అవకాశం ఉంది. అయితే.. అందులో 60 లక్షల మెట్రిక్‌‌ టన్నులు కొనడానికి మాత్రమే ఎఫ్‌‌సీఐ సిద్ధంగా ఉంది. ఇదే పంథాలో ఈ యాసంగిలో కూడా 50 లక్షల ఎకరాలకు పైగా వరిసాగు చేస్తే రైతుల పరిస్థితి అంతే!
లాభం ఎక్కువ
చిరు ధాన్యాలు, ఇతర పంటలతో పోలిస్తే వరి పంట మీద వచ్చే లాభం కాస్త ఎక్కువే. అందుకే రైతులు ఎక్కువగా వరి వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మన రాష్ట్రంలో వరి సాగు మీద సగటున ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయల నికర మిగులు ఉంటుంది. కానీ.. మిగతా పంటలమీద నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఎక్కువమంది రైతులు వరిసాగునే ఎంచుకుంటున్నారు.  
అవసరాలకు మించి..
మన రాష్ట్రంలో అవసరాలకు మించి వరి సాగవుతుంది. రెండు సీజన్లలో కలిపి ముప్పై లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మన అవసరాలకు సరిపోతుంది. కానీ.. కోటి ఎకరాలకు పైగా పండిస్తున్నారు. అందువల్ల వరి ధాన్యం ఎక్కువగా మిగులుతుంది. ఈ ధాన్యాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం కొనేది. కానీ.. రెండేళ్లుగా మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా వరి బాగానే పండింది. అందువల్ల కేంద్రం దగ్గర కూడా అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంత పండిస్తే అంత కేంద్రం కొనే పరిస్థితి లేదు. గతంలో ఏ బియ్యమైనా, ఎంతైనా  ఎఫ్‌‌సీఐ కొనేది. ఇప్పుడు బాయిల్డ్‌‌ రైస్‌‌ వద్దని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే బాయిల్డ్‌‌ రైస్‌‌ నిల్వలు పెరిగిపోయాయి. మన దగ్గర నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బాయిల్డ్‌‌ రైస్‌‌ ఎగుమతి అయ్యేది. కానీ.. ఇప్పుడు వాళ్ల దగ్గర కూడా ప్రొడక్షన్‌‌ పెరిగింది. కాబట్టి ఇంతకుముందులా దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. 
వరిసాగుతో కాలుష్యం
దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల్లో వరి ప్రధాన పంట. దాదాపు 73.7 మిలియన్ హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. అయితే.. చాలా మంది రైతులు ప్రమాదకరమైన పద్ధతుల్లో  వరిసాగు చేస్తున్నారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. వరి పంటకు హెక్టారుకు 150 కిలోల వరకు రసాయన ఎరువులు వాడుతున్నారు. అందులోనూ ఎక్కువగా నత్రజనిని వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే మొత్తం నత్రజని ఎరువుల్లో 10% వరి పంటకే వాడుతున్నారు. దీంతో పాటు గడ్డి నివారణకు కెమికల్స్‌‌ చల్లుతుంటారు. చీడపీడలు ఆశించకుండా పురుగు మందులు స్ర్పే చేస్తుంటారు. వరి పొలంలో నీటిని నిల్వ చేయడం వల్ల ఆ నీటిలో కెమికల్స్‌‌ స్టోరవుతాయి. వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు కాలువల్లో కలవడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఆ నీళ్లు చెరువుల్లో చేరితే చేపల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ఈ నష్టం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా అవసరం మేరకే వరి సాగు చేయడం వల్ల కూడా ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. 
ప్రోత్సాహకాలు
వరి తగ్గించి ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం అనుకుంటే.. దానికి తగ్గట్టు విధానాలను రూపొందించాలి. అంతేకానీ.. ఆల్టర్నేట్‌‌ మార్గాలు చూపించకుండానే  వరి సాగు ఆపేయాలని చెబితే.. రైతులకు ఇబ్బందులు తప్పవు. వరి వద్దంటున్నారు కాబట్టి.. రాష్ట్రానికి అవసరమయ్యే, రైతులకు లాభాలనిచ్చే ఆల్టర్నేట్‌‌ పంటలను గవర్నమెంటే సూచించాలి. వరి ఎందుకు వద్దంటున్నారో తెలిసేలా ప్రతి రైతుకు అవగాహన కల్పించాలి. ప్రత్యామ్నాయ పంటల మీద వచ్చే లాభాల గురించి స్పష్టత ఇవ్వాలి. అవసరమైతే గవర్నమెంట్‌‌ మేలు రకం విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలి. సాగు పద్ధతులపై సలహాలు ఇవ్వాలి. రైతు పండించిన ధాన్యానికి మద్ధతు ధర ఇవ్వాలి. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. అయినా.. రైతులు నష్టపోతారనుకంటే ఇన్సెంటివ్‌‌లు ఇవ్వాలి. ఉదాహరణకు కర్నాటకలో రాగులు పండిస్తే మద్ధతు ధర మీద క్వింటాలుకు 500 రూపాయలు ఇన్సెంటివ్‌‌గా ఇస్తారు. మహారాష్ట్రలో పత్తి పండిస్తే 500 రూపాయలు ఇస్తారు. చత్తీస్‌‌గఢ్‌‌లో వరికి కొంత డబ్బు ఇన్సెంటివ్‌‌గా ఇస్తారు. అలాంటి సిస్టమ్‌‌ని మన రాష్ట్రంలో కూడా తీసుకొస్తే రైతులు ఇతర పంటల వైపు మళ్లే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంటలు నష్టపోతే ఇన్స్యూరెన్స్‌‌ సౌకర్యం కల్పించాలి. వరి, పత్తి వేస్తే రుణాలు ఇచ్చినట్టే ఏ పంట వేసినా.. బ్యాంకులు రుణాలు ఇచ్చే విధంగా మార్పులు తీసుకురావాలి. వరితో పోలిస్తే చిరు ధాన్యాల పంటలపై అడవి జంతువులు ఎక్కువగా దాడులు చేస్తుంటాయి. మొక్కజొన్న, రాగులు, శనగలు లాంటి పంటల మీద కోతులు ఎక్కువగా దాడి చేస్తుంటాయి. ఇలా నష్టం జరిగినా ఇన్స్యూరెన్స్‌‌ వర్తించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి ఏర్పాట్లు చేస్తేనే రైతులు వరి నుంచి ఇతర పంటలకు మళ్లే అవకాశం ఉంటుంది. 
మద్దతు ధర 
మన రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా మిల్లెట్స్‌‌కు బాగా డిమాండ్‌‌ ఉంది. కానీ.. సాగు విస్తీర్ణం మాత్రం మన రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్‌‌ పామ్‌‌, నూనె గింజలకు బాగా డిమాండ్‌‌ ఉంది. అయినా.. వాటి సాగు విస్తీర్ణం మన దగ్గర పెద్దగా పెరగడం లేదు. ఎందుకంటే.. మిల్లెట్స్‌‌ పండిస్తే పంట చేతికొచ్చిన తర్వాత మద్దతు ధర దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. ఒక వేళ మద్దతు ధర ప్రకటించినా వాటిని కొనడానికి  కొనుగోలు కేంద్రాలు ఉండవు. అందువల్ల రైతులు మిల్లెట్స్‌‌ పండించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.  మన దగ్గర కొర్రలు, సామలు, ఊదల వాడకం ఎక్కువగా ఉన్నా పండించేది మాత్రం వెయ్యి ఎకరాల లోపే. జొన్నలు, సజ్జలు మినహా చిరుధాన్యాలు పండించేది చాలా తక్కువ. మార్కెట్‌‌ సెక్యూరిటీ ఉంటే వీటి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నూనె గింజలు విషయానికి వస్తే.. గింజలు పండించినా నూనె తీయడానికి సరిపడా మిల్లుల్లేవు. పైగా మద్దతు ధర గ్యారెంటీ లేదు. 
ఎగుమతులు  
మన దేశం నుంచి ఇతర దేశాలకు కూడా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు బియ్యాన్ని అత్యధికంగా ప్రొడ్యూస్‌‌ చేస్తున్న దేశాల్లో మనది రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది అత్యధికంగా ఆఫ్రికా, ఆసియా దేశాల‌‌కు బియ్యం ఎగుమతి చేసింది. కాకినాడ‌‌లోని పోర్ట్ ద్వారా ఈ ఏడాది సుమారు 22 మిలియ‌‌న్ ట‌‌న్నుల బియ్యాన్ని ఎగుమ‌‌తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బియ్యం ఎగుమతుల్లో థాయిలాండ్‌‌, వియ‌‌త్నాం దేశాలతో ఇండియా పోటీ పడుతోంది. గతంతో పోలిస్తే 2020లో బియ్యం ఎగుమ‌‌తులు 49 శాతం పెరిగాయి. అయినా.. దేశంలో మిగులు బియ్యం ఉంటున్నాయి. 
నీటి వినియోగం ఎక్కువ
వరి పండించాలంటే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అందుకోసం బోర్లను ఎక్కువ సేపు నడిపించాలి. దానివల్ల కరెంట్‌‌ ఎక్కువగా ఖర్చవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనివల్ల సహజ వనరులు కూడా తగ్గిపోతున్నట్టే. కాబట్టి నీరు తక్కువగా అవసరమయ్యే ఆరుతడి పంటలే వేసి, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఒక ఎకరం వరి పండించే నీటితో  దాదాపు 2-3 ఎకరాల మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, కూరగాయలు పండించొచ్చు. 4-0 ఎకరాల్లో అలసందలను, పెసర, మినుము, శనగలు పండించొచ్చు. కొన్నిసార్లు వర్షాలు ఆలస్యంగా పడ్డా ఈ పంటలకు పెద్దగా నష్టం ఉండదు. వరికి 1200 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. అదే కొర్రలు, రాగులకు 300 మిల్లీమీటర్లు, పప్పు ధాన్యాలకు దాదాపు 600 మిల్లీమీటర్లు, అరటి, చెరుకు 1000 మిల్లీ మీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. 
 
వర్షాలు 
గతంలో వర్షాలు లేక తెలంగాణలో ఎక్కువగా మొక్కజొన్న, వేరుశనగ, పత్తి లాంటి పంటలు వేసేవాళ్లు. కానీ.. కొన్నేళ్ల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగాయి. అందువల్ల బోరు బావుల్లో నీటిశాతం పెరిగింది. తెలంగాణలో ఎక్కువగా బోరు బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. దానివల్ల సాగు నీటి శాతం పెరిగింది. అందుకే కొన్నేళ్ల నుంచి రైతులు ఎక్కువగా వరి వేయడానికే ఇష్టపడుతున్నారు. ఈ సంవత్సరం సీజన్‌‌ మొదటి నుంచీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఎక్కడా లోటు వర్షపాతం లేదు. 33 జిల్లాల్లో వర్షాలు బాగా కురిశాయి.  పైగా 21 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు రాష్ట్రంలో 701.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం ఉండాలి. కానీ.. 920.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది సాధారణం కంటే 31% ఎక్కువ. పోయినేడు కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 

కొనకుంటే ఎట్ల? 
నీళ్లు లేనప్పుడు మొక్కజొన్న పండించినం. అప్పుడు అడవి పందులు చేను మీద పడి మొత్తం నాశనం చేస్తుండె. ఒక్కోసారి పెట్టుబడి కూడా మిగలకపోతుండె. అందుకే తిప్పలు వడి ఐదేండ్ల  కింద బోర్‌‌ వేసిన. కానీ.. అప్పుడు వరికి సరిపోయేన్ని నీళ్లు రాలె. మూడు నాలుగేళ్ల నుంచి నీళ్లు మంచిగొస్తున్నయని వరి ఏస్తున్న. పెట్టుబడి పోను పంటకు పది నుంచి పదిహేను వేల రూపాయలు మిగులుతున్నయ్. ఇప్పుడేమో వరి వద్దంటున్నరు. బోరుకోసం చేసిన అప్పులు ఇంకా తీరలె. ఇప్పడు మళ్లీ మొక్కజొన్న పటేస్తే అప్పుల పాలు కాక తప్పదు. అందుకే గవర్నమెంట్‌ వడ్లు కచ్చితంగా కొనాలె.                                                                                                                                                                   – రాములు, సిద్దిపేట
ఆ పంటలు పండించొచ్చు
తెలంగాణలో అవసరాలకు మించి వరి సాగవుతుంది. కాబట్టి మార్కెట్‌‌ చేయడం కష్టం  అవుతుంది. అందువల్ల వరిసాగు తగ్గించడమే మంచిది. ఖరీఫ్‌‌లో 30 నుంచి 40 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే సరిపోతుంది. యాసంగిలో మాత్రం పండించకపోవడమే మంచిది. అయితే.. అందుకు కావాల్సిన ప్రత్యామ్నాయాలకు కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. యాసంగిలో వేసే పంటలను గవర్నమెంట్‌‌ సేకరిస్తుందనే గ్యారెంటీ ఇవ్వాలి. ఇన్సెంటివ్‌‌లు ఇవ్వాలి. పంటలకు ఇన్స్యూరెన్స్‌‌ సౌకర్యం కల్పించాలి. అడవి జంతువుల వల్ల నష్టం కలిగినప్పుడు ఇన్స్యూరెన్స్‌‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలి. వరి, గోధుమ, పత్తికి మద్దతు ధర, సేకరణ ఉండడం వల్ల వీటిని ఎక్కువగా పండిస్తున్నారు. కాబట్టి మిగతా పంటలకు కూడా మద్దతు ధర ఇస్తామనే భరోసా కల్పిస్తే ఆ పంటలు పండించే అవకాశం ఉంటుంది. దానికోసం కావాల్సిన పాలసీలు రూపొందించాలి. గ్రామాల్లో చర్చలు జరగాలి. అలా చేస్తే రైతులు ఇతర పంటలు వేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే.. వాటిని కట్టేది వరి కోసం మాత్రమే కాదు. ఏ పంటకైనా నీళ్లు అవసరం అవుతాయి. కొన్ని సార్లు వాతావరణంలో మార్పుల వల్ల 25 రోజుల వరకు కూడా వర్షాలు పడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పంటలకు నీళ్లు అందించడాన్ని క్రిటికల్‌‌ ఇరిగేషన్‌‌ అంటారు. నీళ్లు లేనప్పుడు తడి ఇవ్వడానికి మాత్రమే ప్రాజెక్టులోని నీళ్లను వాడుకోవాలి. అయితే... రాష్ట్రానికి కావాల్సినంత వరి పండించడానికి అవసరమయ్యే సాగు నీటిని అందించే ప్రాజెక్టులు ఇప్పటికే మన దగ్గర ఉన్నాయనుకుంటే.. కొత్తగా కట్టేవి తక్కువ సామర్థ్యంతో కట్టుకోవాలి. కానీ.. పెద్ద ప్రాజెక్టులు కట్టి కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని చెప్పడంతో రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్లాయి. అందుకే వరి వైపు మళ్లారు. కానీ.. రైతులకు లాభాలు రావాలంటే కేవలం నీళ్లందిస్తే సరిపోదు. 95శాతం నీటి పారుదల సౌకర్యాలున్న పంజాబ్‌‌లో కూడా క్రైసిస్‌‌ ఉంది. కాబట్టి బాగా  నీళ్లుంటేనే రైతులు బాగుపడతారనేది అవాస్తవం. మన దగ్గర 25 రకాల పంటలు పండుతాయి. కాబట్టి రైతులు ఆ పంటలన్నీ పండించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. కేవలం పత్తి, వరిని ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తే రాబోయే రోజుల్లో సమస్యలకు దారి తీస్తుందని మేం ముందునుంచే హెచ్చరిస్తున్నాం. అయినా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎత్తిపోతల ప్రాజెక్ట్‌‌లకు ఎక్కువగా కరెంట్‌‌ బిల్లులు కట్టాల్సి వస్తుంది. కాళేశ్వరం పూర్తి స్థాయిలో నడిస్తే దాదాపు 14 వేల కోట్ల రూపాయలు కరెంట్‌‌ బిల్లు కట్టాలి. పైగా బోర్ల కరెంట్‌‌ కోసం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల బిల్లు కడుతుంది గవర్నమెంట్‌‌. కాబట్టి దాదాపు 20 వేల కోట్ల రూపాయలు కరెంట్‌‌ బిల్లులు తలకు మించిన భారమవుతాయి. ఇక అడ్డగోలుగా రైతుబంధు డబ్బు ఇస్తున్నారు. కొండలకు, మైదానాలకు, రియల్‌‌ఎస్టేట్‌‌ వెంచర్లకు రైతుబంధు ఇచ్చే బదులు ఆ డబ్బును రైతులు బాగుపడేందుకు వాడాలి. 
కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు 
ఏ పంటలు పండించాలి? 
మన దగ్గర వరి సాగు చేసే పద్ధతుల్లో మార్పులు రావాలి. ముఖ్యంగా కొన్నేళ్ల నుంచి వరి పండిస్తున్న రైతులు ఒక్కసారిగా ఇతర పంటలే వేయాలంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే భూములన్నీ వరికి అనుగుణంగా తయారయ్యాయి. వెంటనే ఇతర పంటలు వేస్తే సరిగ్గా పండవు. భూమి గుల్లగా ఉండదు. కాబట్టి వేళ్లు పూర్తిగా భూమిలోకి వెళ్లవు. కాబట్టి ముందుగా భూమిని గుల్ల చేసుకోవాలి. నీళ్లను తక్కువగా వాడాలి. పచ్చిరొట్ట ఎరువులు వేయాలి. పిండి పిండిగా ఉన్న భూములు గుల్లగా మారడానికి కనీసం రెండు మూడేళ్లయినా పడుతుంది. భూమిని ఎక్కువ లోతుగా దమ్ము చేయడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నీళ్లు చాలా తక్కువగా వాడే పద్ధతుల్లో వరి పండించాలి. అలా పండిస్తేనే వానాకాలంలో వరి వేసి, యాసంగిలో వేరే పంట పండించే అవకాశం ఉంటుంది. కానీ.. పాత పద్ధతుల్లోనే వరి సాగు చేస్తే ఆ తరువాత వేసే పంట సరిగ్గా పండదు. 

                                                                                                                                                                                      ::: సగన్​