
ప్రస్తుత కాలంలో అత్యుత్తమ టీ20 ప్లేయర్లు ఎవరో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తేల్చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు బెస్ట్ టీ20 క్రికెటర్లను ఎంపిక చేశాడు. ఇందులో టీమిండియా నుంచి ఇద్దరిని సెలక్ట్ చేసుకున్నాడు. సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక్కో ప్లేయర్ ను ఎంపిక చేశాడు. అయితే వరల్డ్లోనే పేరుగాంచిన కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేయకపోవడంతో పాంటింగ్పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
నెం.1 ప్లేయర్ రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్‌ను వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్‌గా పాంటింగ్ సెలక్ట్ చేశాడు. 2023 ఐపీఎల్ వేలంగా రషీద్ ఖాన్ పాల్గొంటే..అత్యధిక ధరకు అమ్ముడవుతాడని చెప్పాడు. రషీద్ ఖాన్ కేవలం బౌలర్ మాత్రమే కాదని.. మంచి హిట్టర్ అని పేర్కొన్నాడు. రషీద్ లాంటి ప్లేయర్ జట్టులో ఉండటం మేలు జరుగుతుందని తెలిపాడు. రషీద్ ఖాన్ చెలరేగితే మాత్రం...ఏలాంటి మ్యాచ్ అయినా..వన్ సైడ్ కావడం ఖాయమన్నాడు.
పాక్ కెప్టెన్ కు నెం.2 స్థానం..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ను టాప్ 2 టీ20 ప్లేయర్ గా పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ర్యాంకింగ్ లో బాబర్..అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ఆసియా కప్ లో మాత్రం ఆజాబ్ విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన చేశాడు.
బెస్ట్ ఆల్ రౌండర్..
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు పాంటింగ్ మూడో స్థానం ఇచ్చాడు. హార్థిక్ బెస్ట్ ఆల్ రౌండర్ అని చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా ఆటను బాగా అర్థం చేసుకుంటున్నాడని.. అతను మెరుగయ్యాడని తెలిపాడు. టీ20లే కాదు.. వన్డేల్లోనూ హార్దిక్ బెస్ట్ ఆల్రౌండర్ అని పాంటింగ్ అన్నాడు.
జోస్ బట్లర్
టీ20ల్లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను పాంటింగ్ నంబర్ 4 టీ20 ప్లేయర్‌గా ఎంపిక చేశాడు. అవుట్-అండ్-అవుట్ మ్యాచ్ విన్నర్లలో బట్లర్ ఒకడని చెప్పాడు. అతను కంప్లీట్ హిట్టర్ మాత్రమే కాకుండా బాధ్యతగల ప్లేయర్ అని పాంటింగ్ కొనియాడాడు. ఓపెనర్‌గా బట్లర్ నిలదొక్కుకుంటే.. బౌలర్లు అతన్ని ఔట్ చేయలేరని చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్లో బట్లర్ నాలుగు సెంచరీలు చేశాడు.
బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొవడం కష్టం
టీమిండియా జస్ప్రీత్ బుమ్రాను నంబర్ 5గా ప్లేయర్గా పాంటింగ్ పేర్కొన్నాడు. బుమ్రా బౌలింగ్లో ఆడటం కష్టమని చెప్పాడు. కొత్తబంతితో బౌలింగ్ చేస్తే ఎదుర్కొవడం మరింత కష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్రికెట్లో బుమ్రా పూర్తిస్థాయి బౌలర్‌గా కొనసాగుతున్నాడని చెప్పాడు. టీ20ల్లో అతని డెత్ బౌలింగ్ స్కిల్స్ ఆమోఘమని తెలిపాడు. బుమ్రా టీమిండియాకు బిగ్ అస్సెట్ అని వివరించాడు. టీ20 వరల్డ్ కప్ లోగా బుమ్రా కోలుకుంటే ఇండియా గెలుపులో అతని కీలక పాత్ర పోషిస్తాడని పాంటింగ్ వెల్లడించాడు.