ఐస్‌లాండ్ ఒక అగ్ని పర్వతాల పుట్ట. ఈ ఒక్క దేశంలోనే 32 యాక్టివ్ వాల్కనోలు ఉన్నాయి. అయితే దాదాపు 900 ఏండ్ల నుంచి చలనం లేకుండా ఉన్న ఫగ్రడల్సఫ్‌జల్ అగ్ని పర్వతం ఇటీవలే బద్దలైంది. కొన్ని నెలలుగా దాదాపు పది వేల సార్లు పైగా భూకంపం వచ్చిన తర్వాత మార్చి 24న ఒక్కసారిగా నిప్పులు కక్కుతూ భారీగా లావా వెదజిమ్మడం మొదలైంది. రెండు మూడ్రోజుల పాటు ఈ విస్ఫోటనం కొనసాగింది. అగ్ని పర్వతం లావాను బయటకు కక్కుతున్న సీన్‌ను బాగా క్లోజ్‌గా వీడియో తీయాలని యూరప్‌కు చెందిన యూట్యూబర్ జోయ్ హెల్మ్స్ (Joey Helms) అనుకున్నాడు. డ్రోన్ కెమెరాతో అగ్ని పర్వతం ఏరియల్ వ్యూతోపాటు లావా ఉప్పొంగే కొన్ని సెకన్ల ముందు నుంచి వీడియో తీశాడు. దానిని మే 26న, జూన్ 1న రెండు పార్ట్స్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో చూడాలనుకుంటే అతడి పేరుతో సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది.
