RIP : సోషల్ మీడియా మీమ్స్ కుక్క చనిపోయింది.. చలించిపోయిన నెటిజన్లు

RIP : సోషల్ మీడియా మీమ్స్ కుక్క చనిపోయింది.. చలించిపోయిన నెటిజన్లు

ఈరోజుల్లో కంటెంట్ ఎక్కువమందికి రీచ్ అవ్వాలన్నా, త్వరగా రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా మీమ్స్ బెస్ట్ ఛాయస్ అని చెప్పాలి. ఈ మీమ్స్ ద్వారా నేటి యూత్ తమ క్రియేటివిటీ చాటుకుంటున్నారు. చాలా మంది కాలక్షేపానికి కూడా మీమ్స్ నే చేస్తున్నారు. ఇదిలా ఉండగా మీమర్స్ కి, నెటిజన్స్ కి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి తెలుస్తోంది. సోషల్ మీడియాలో మీమ్స్ కి ఐకాన్ గా మారిన శునకం "డాగీ" మృతి చెందింది. ఒకానొక సమయంలో ట్విట్టర్ లోగోగా కూడా మారిన ఈ 19ఏళ్ళ జపనీస్ డాగ్ క్యాన్సర్, లుకేమియా వ్యాధులతో బాధపడుతూ ఇవాళ మృతి చెందింది.

సోషల్ మీడియాలో "డాగీ" గా పాపులర్ అయిన ఈ కుక్క పేరు కబోసు, 2008లో అత్సుకో సాటో అనే జపాన్ కు చెందిన మహిళ దీనిని అడాప్ట్ చేసుకుంది. కబోసు మరణవార్తను తన సోషల్ మీడియా ద్వారా తెలిపిన సాటో మే 26న కాబోసు ఫేర్వెల్ పేరిట ఇక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ వార్త పట్ల నెటిజన్లు చలించిపోయారు. RIP కబోసు, బౌతికంగా దూరమైనా మీమ్స్ రూపంలో నిన్ను ఎప్పటికి స్మరించుకుంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు