
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు నెల తర్వాత కేసుల సంఖ్య వంద దాటింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. మంగళవారం 119 కేసులు నమోదయ్యా్యి. కేవలం హైదరాబాద్లోనే 79 మంది వైరస్ బారిన పడ్డారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 7,93,791 కు చేరింది. మరణాల సంఖ్య 4,111గా ఉన్నది. రికవరీ రేట్ 99.40 శాతం ఉండగా.. డెత్ రేట్ 0.51 శాతం ఉన్నది. కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.