ఆ సమయంలో చనిపోతాననుకున్నా.. యాక్సిడెంట్‌పై రిషబ్ పంత్

ఆ సమయంలో చనిపోతాననుకున్నా.. యాక్సిడెంట్‌పై రిషబ్ పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30 న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్కు వెళ్తుండగా..రూర్కి వద్ద పంత్ కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డు పక్కన రెయిలింగ్ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి  పూర్తిగా దగ్ధమైంది. ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన పంత్..కారు అద్దాలు పగులకొట్టుకుని బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ విషాద ఘటన గురించి తాజాగా పంత్ స్పందించాడు. 

యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ప్రపంచంలో తన సమయం ముగిసిందని పంత్ తన మొదటి ఆలోచనను తెలిపాడు. యాక్సిడెంట్ తర్వాత నేను బతకలేననే ఆలోచన భయానికి గురి చేసింది. నేను అదృష్టవంతుడిని. క్రాష్ అయినప్పటికీ నేను సజీవంగానే ఉన్నాను. ఎవరో నన్ను రక్షించినట్లు అనిపించింది. కోలుకోవడానికి డాక్టర్ 16 నుంచి 18 నెలలు పడుతుందని చెప్పారు. ఇది ఒకరకంగా నాకు పునర్జన్మ. అని పంత్ స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 

పంత్ త్వరలోనే టీమిండియాలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న పంత్ ప్రస్తుతం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడు. పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరి కొంత సమయం పట్టేలా కనిపిస్తుందని సమాచారం. నివేదికల ప్రకారం రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలని ఢిల్లీ యాజమాన్యం భావిస్తుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే 2024 టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి పంత్ ను ఎంపిక చేయాలని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీ కూడా పంత్ మిస్ అయ్యాడు.