భద్రాచలంలో గోదావరికి నదీ హారతి

భద్రాచలంలో గోదావరికి నదీ హారతి

భద్రాచలం, వెలుగు : రివర్ ఫెస్టివల్ ఏరు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరికి ఘనంగా నదీ హారతి కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్​ఆధ్వర్యంలో అర్చకులు గోదావరికి పూజలు చేసి పట్టువస్త్రాలు, పుష్పాలు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో దామోదర్​రావు, సీఎస్ఆర్ సమ్మిట్ డైరెక్టర్ సుమంత్​పాల్గొన్నారు.