అన్ని రాష్ట్రాలు  ఓకే చెప్పినంకే రివర్‌‌ లింకింగ్‌‌

అన్ని రాష్ట్రాలు  ఓకే చెప్పినంకే రివర్‌‌ లింకింగ్‌‌

జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌‌ కుమార్‌‌
పోలవరం నుంచి లింక్‌‌ చేయాలి: ఏపీ

హైదరాబాద్‌‌/న్యూఢిల్లీ, వెలుగు: అన్ని రాష్ట్రాలు ఓకే అంటేనే గోదావరి–- కావేరి అనుసంధానం ప్రాజెక్టు చేపడుతామని కేంద్ర జల శక్తి శాఖ సెక్రటరీ పంకజ్‌‌ కుమార్‌‌ తెలిపా రు. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌‌లో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, ఐదు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు.మొదట తమ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని కోరారు. నదిలో నీటి లభ్యతపై సైంటిఫిక్‌‌‌‌గా స్టడీ చేయాలని, మిగులు జలాలు ఉన్నట్లు తేలితే వాటిని నదుల అనుసంధానంలో ఉపయోగించుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. నీటి లభ్యతపై ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ నిర్వహించిన స్టడీల్లో ఒక్కోసారి, ఒక్కోలా మిగులు జలాల లెక్క తేల్చారని, దీనిపై కేంద్రానికి క్లారిటీ ఉన్నట్టు అనిపించడం లేదన్నారు. గోదావరిలో 75 శాతం డిపెండబులిటీ దగ్గర అసలు మిగులు జలాలే లేవన్నారు. 50 శాతం డిపెండబులిటీతో లెక్కిస్తేనే ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ అంచనా మేరకు మిగులు జలాలు ఉండే అవకాశముందన్నారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీళ్లు తరలించాలనే ప్రపోజల్‌‌‌‌పై తమకు అభ్యంతరం లేదని, పోలవరం కుడి కాలువ ద్వారా రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌ చేపడితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని ఏపీ అధికారులు తెలిపారు.
సమాన వాటా ఇవ్వాలన్న కర్నాటక
మిగతా రాష్ట్రాలతో పోల్చితే తమ రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని కర్నాటక అధికారులు తెలిపారు. గోదావరి నుంచి కృష్ణాకు, అక్కడి నుంచి కావేరికి మళ్లించే నీటిలో సమాన వాటాను తమకు ఇవ్వాలని కోరారు. నదుల అనుసంధానం అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌లో తాము సూచించిన చిన్నపాటి మార్పులు చేయాలని తమిళనాడు అధికారులు కోరారు. తమకు ఇస్తామన్న 84 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌‌‌‌ ఎస్‌‌‌‌కే హల్దార్‌‌‌‌ మాట్లాడుతూ.. తెలంగాణ, ఏపీ మిగులు జలాలపై అభ్యంతరాలు లేవనెత్తుతుండటంతో చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ ఉపయోగించుకోకుండా మిగులుతున్న నీటిని మాత్రమే రివర్‌‌‌‌ లింకింగ్‌‌‌‌కు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జలశక్తి శాఖ సెక్రటరీ పంకజ్‌‌‌‌ కుమార్‌‌‌‌ మాట్లాడుతూ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ నీటిని లింకింగ్‌‌‌‌ కోసం ఉపయోగిస్తుండటంతో ఆ రాష్ట్రంతోనూ అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టాలన్నారు. జలశక్తి శాఖ మినిస్టర్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ, జాతీయ దృక్పథంతో ఈ లింక్‌‌‌‌ ప్రాజెక్టు చేపట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌‌‌‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ సంయుక్తంగా నీటి లభ్యత, ట్రిబ్యునల్‌‌‌‌ కేటాయింపులపై స్టడీ చేయాలని హల్దార్‌‌‌‌ అన్నారు. ప్రాజెక్టులో రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాల మేరకు మార్పులు చేసిన తర్వాతే ఫైనల్‌‌‌‌ చేయాలని సూచించారు. రాష్ట్రాల నీటి వాటాలు తేల్చేందుకు ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఇంటర్‌‌‌‌ స్టేట్‌‌‌‌ ఈఈ సుబ్రమణ్య ప్రసాద్‌‌‌‌, ఏపీ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు.