Riyan Parag vs Vaibhav: ఐపీఎల్ (IPL 2026) క్వాలిఫయర్-2 మ్యాచ్ ముగిసినా.. నెట్టింట దీనికి సంబంధించిన చర్చలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 47 బంతుల్లోనే 96 రన్స్ చేసి అవుటైన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్ విజువల్స్ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 90+ రన్స్ కే అవుటై నిరాశగా వెనుతిరుగుతున్న వైభవ్‌ను చూసి, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఘోరంగా తిట్టిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అక్కడ జరిగింది వేరే:
వైరల్ అవుతున్న వీడియోలో రియాన్ పరాగ్ సీరియస్‌గా మాట్లాడినట్లు కనిపిస్తున్నా.. అతను వైభవ్‌ను అస్సలు తిట్టలేదని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్య వర్గాలు పేర్కొంటున్నాయి. అక్కడ ఏం జరిగిందే, కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకొని, పైగా టీమ్ కూడా ఫైనల్ రేస్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో 15 ఏళ్ల వైభవ్ పిచ్‌పైనే బాగా ఎమోషనల్ అయ్యాడు. కళ్లల్లో నీళ్లతో తలదించుకుని డగౌట్ వైపు వెళ్తున్న ఆ వండర్ కిడ్‌ను చూసి.. కెప్టెన్ రియాన్ పరాగ్ అతని దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి, ఓదారుస్తూ గుండెకు హత్తుకున్నాడు.
పరాగ్ ఏం చెప్పాడంటే?:
మ్యాచ్ జరిగే సమయంలో పరాగ్ చేసిన కొన్ని హావభావాలను తప్పుగా అర్థం చేసుకుని కొందరు నెగెటివ్ ప్రచారం చేశారు కానీ, క్లోజప్ విజువల్స్ ప్రకారం పరాగ్ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ఫుల్ సపోర్ట్‌గా నిలిచాడు.
* నువ్వు తోపువయ్యా.. తలదించుకోకు: సెంచరీ మిస్సయితే ఏమైంది? నువ్వు ఆడిన 96 రన్స్ వల్లే టీమ్ 214 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.. తల పైకి పెట్టుకో అంటూ రియాన్ పరాగ్ ధైర్యం చెప్పాడు.
* టీమ్ ఫస్ట్ సెంటిమెంట్: వ్యక్తిగత మైలురాళ్ల కంటే టీమ్ కోసం నువ్వు ఇచ్చిన ఇంపాక్ట్ చాలా పెద్దదని, ఈ చిన్న వయసులోనే ఇంత ప్రెజర్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడావంటూ కొనియాడాడు.
* రియాన్ పరాగ్ ప్రవర్తనపై మొదట్లో నెగెటివిటీ క్రియేట్ చేయాలని చూసినా.. అసలు మ్యాటర్ బయటకు రావడంతో క్రికెట్ ఫ్యాన్స్ పరాగ్ లీడర్‌షిప్‌ను నెక్స్ట్ లెవెల్‌లో పొగుడుతున్నారు. ఒక 15 ఏళ్ల వైభవ్ మానసిక స్థితిని అర్థం చేసుకుని, ఒక అన్నలాగా సపోర్ట్ ఇచ్చిన పరాగ్ కెప్టెన్సీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని కామెంట్లు పెడుతున్నారు. సో.. నెట్టింట వైరల్ అవుతున్నట్లు అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని తెలుస్తుంది.
