బీహార్ లో అనూహ్య ఫలితం: భర్తపై అనర్హత వేటు.. బై పోల్ లో భార్య విజయం

బీహార్ లో అనూహ్య ఫలితం: భర్తపై అనర్హత వేటు..  బై పోల్ లో భార్య విజయం

బీహార్ రాష్ట్రంలోని మొకామా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థి నీలం దేవి గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్ధి సోనమ్ దేవీపై 66 వేల 587 ఓట్ల మెజార్టీతో నీలం విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. నీలం దేవికి 79,744 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవికి 63,003 ఓట్లు వచ్చాయి. 

నీలం దేవి భర్త పేరు అనంత్ కుమార్ సింగ్. అతడు గతంలో ఇదే స్థానంలో ఎమ్మెల్యేగా ఉండేవాడు.  అనంత్ నివాసం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో పాట్నా కోర్టు అనంత్ ను దోషిగా నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది జూలైలోనే అనంత్ పై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బై పోల్ లో ఆర్జేడీ అభ్యర్థిగా సింగ్ సతీమణి నీలం దేవి బరిలోకి దిగి విజయభేరి మోగించారు. ‘‘ నా గెలుపును ముందే ఊహించాను. ఎవరూ పోటీలో నిలువలేరని ముందే చెప్పాను. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ఆర్జేడీకి భారీ ఆధిక్యం కట్టబెట్టారు’’ అని నీలం దేవి  వ్యాఖ్యానించారు.