వర్సిటీలకు వీసీలను నియమించాలి: ఎస్ఎఫ్ఐ

వర్సిటీలకు వీసీలను నియమించాలి: ఎస్ఎఫ్ఐ

ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు రెగ్యులర్​వీసీలను నియమించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఓయూలో మీడియాతో మాట్లాడారు. వీసీల  నియామకంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇన్​చార్జీల పాలనతో కాలయాపన తగదన్నారు. తక్షణమే పీహెచ్ డీ నోటిఫికేషన్ వేయాలని కోరారు.

యూనివర్సిటీల అభివృద్ధికి సంబంధించిన పెండింగ్​ఫైల్స్​పేరుకుపోతున్నాయని, సమస్యల పరిష్కారంలో ఇన్​చార్జ్​వీసీలు ఫెయిల్​అయ్యారని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్, కృష్ణ, శ్రీకాంత్, అజయ్, శ్రీను పాల్గొన్నారు.