
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న గాయత్రి
శామీర్ పేట, వెలుగు: బస్సు కోసం వేచి చూస్తుండగా రెడీమిక్స్లారీ ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కొరివి భవాని మంగళవారం మృతి చెందింది. తీవ్ర గాయాలతో గాయత్రి చికిత్స పొందుతోంది. తూముకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు గాయత్రి(24), భవాని(19) తిరుమలగిరి వెళ్లేందుకు సోమవారం శామీర్‌పేటలోని బిట్స్ జంక్షన్ కు వచ్చారు. అక్కడి బస్టాపులో వేచి ఉండగా కీసర వైపు నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొంపల్లి శ్రీకర హాస్పిటల్ లో చికిత్స పొందుతూ భవాని మంగళవారం చనిపోయింది. రెండు రోజుల ట్రీట్మెంట్కు రెండున్నర లక్షలు కట్టినప్పటికీ, మరో రూ.90 వేలు కట్టి డెడ్‌బాడీని తీసుకెళ్లాలని హాస్పిటల్యాజమాన్యం చెప్పడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.