
శామీర్ పేట, వెలుగు: బొలెరో ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. శామీర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మజీద్పూర్కు చెందిన పర్వతపురం హరిబాబు(35) సోమవారం రాత్రి బైక్పై తూంకుంట నుంచి ఇంటికి వెళ్తున్నాడు.
నల్సార్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదే స్పీడ్తో బైక్ను 20 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో హరిబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. బొలెరో డ్రైవర్వాహనం ఆపి, అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.