శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ఉబర్ క్యాబ్ ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ( జనవరి 13 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న ఉబర్ క్యాబ్ డివైడర్ ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు నెలల గర్భిణీ, ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన గంట వరకు అంబులెన్స్ కానీ, పోలీసులు కానీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. స్థానికుల ఫిర్యాదుతో గంట తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రైవేట్ అంబులెన్స్ లో బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడ్డ గర్భిణీ, ఆమె తల్లి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
