కళ్లు చెదిరిపోయే వీడియో : యాక్సిడెంట్ వీడియో వైరల్

కళ్లు చెదిరిపోయే వీడియో : యాక్సిడెంట్ వీడియో వైరల్

మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి-మజీదుపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంఘటన జరిగేటప్పుడు ప్రత్యక్షంగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఇన్నోవా కారు హైదరాబాద్ వైపు మీతిమీరిన వేగంతో వస్తుంది. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి అపోసిట్ వేలో వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని తెలిపారు. వీరు హకీంపేట్ కు చెందిన శేఖర్ మోహన్ వాలే, మౌలాలి ప్రాంతానికి చెందిన మలావత్ దీపిక గా గుర్తించారు. 

ఈ ప్రమాదంలో మోహన్ కారు నడుపుతున్నాడు. ఓ ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టి.. వెనుకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో మృతి చెందినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్మా కంపెనీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెల్లగా అందులో ఉన్న పది మంది వరకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.