జనగామలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

జనగామలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు దగ్గర మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. ముగ్గురు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

ఇటు సిరిసిల్ల జిల్లాలోనూ మరో ప్రమాదం జరిగింది. కోనరావుపేట మండలం.. మామిడిపల్లి దగ్గర ఆటో ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా… మరో ముగ్గిరికి గాయాలు అయ్యాయి.