ఢివైడర్ ను ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

 ఢివైడర్ ను ఢీ కొట్టిన కారు.. యువతి మృతి

హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని శాతంరాయి అపర్ణా టవర్స్ వద్ద అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న ఓ కారు డివైడర్ ను ఢీ కొట్టింది.  ఈ ఘటనలో యువతి మృతి చెందగా మరొ ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. 

మృతి చెందిన యువతిని  కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియ కకేడే(25)గా గుర్తించారు.  తనియా తన స్నేహితుడితో కలిసి పార్టీకి వెళ్లి కారులో ఇంటికి తిరిగి వెళుతుండగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్  పోలీస్ స్టేషన్ పరిధిలోని సాతం రాయి అపర్ణ టవర్స్ వద్ద డివైడర్ను బలంగా ఢీ కొట్టి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తానియా సంఘటన స్థలంలో మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న మరో మహిళ దియకు మరో వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు తానియ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు .కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.