సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

సికింద్రాబాద్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్ నగర్ కు చెందిన రామయ్య, దామోదర్ రెడ్డి అనే  ఇద్దరు వ్యక్తులు టూ వీలర్ పై ఈస్ట్ మారేడ్ పల్లి వైపు వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన పాలవ్యాను టూవీలర్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఈస్ట్ మారేడ్ పల్లిలోని ఈశ్వరీ బాయి విగ్రహం వద్ద జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. నార్త్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డిసిపి భాస్కర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పాల వ్యాన్  డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బండిని వదిలేసి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.