3 వాహనాలు ఢీ : ఇద్దరు మృతి.. 21 మందికి గాయాలు

3 వాహనాలు ఢీ : ఇద్దరు మృతి.. 21 మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురం జిల్లా ఊచిపులి దగ్గర యాక్సిడెంట్ అయింది. మూడు వాహనాలు ఒకదానికొకటి వేగంగా గుద్దుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో… ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. మూడు వాహనాల్లో ప్రయాణిస్తున్న 21 మంది గాయపడ్డారు.

రోడ్డుపై ఒకదాని వెంబడి వేగంగా వెళ్తున్న టెంపో ట్రావెలర్, కారు ఢీకొన్నాయి. వీటి వెనకాలే మరో ట్రాన్స్ పోర్ట్ మినీ వాహనం వచ్చి.. అది కూడా ఢీకొట్టింది. 3 వాహనాలు బలంగా గుద్దుకుని.. ఒకదానిపై మరొకటి పడిపోయాయి. ఏసీ టెంపో ట్రావెలర్ దాదాపుగా నుజ్జునుజ్జయిపోయింది. అందులోనే ఎక్కువమంది ఉండటంతో.. వారందరికీ గాయాలయ్యాయి.