
మెదక్ జిల్లాలోని ఏడు పాయల కమాన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి మెదక్ టౌన్ ఎస్సై విఠల్ కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఎస్సై విఠల్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్సై విఠల్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా చేర్యాల ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డికి చెందిన ఎం.రాజేశ్వర్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా బుధవారం రాత్రి బందోబస్తు డ్యూటీ చేసిన రాజేశ్వర్.. విధులు ముగిసిన తర్వాత కారులో సంగారెడ్డిలోని తన ఇంటికి వెళ్తున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల టైంలో సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చేర్యాల ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఎస్సైని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.